పుష్పక విమానం లాంటి చిత్ర సీమలో నాకంటూ ఓ చిన్న స్థానం దక్కించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను" అంటున్నారు వర్ధమాన నటీమణి వాణిశ్రీకుమార్. 'నేల టికెట్, నేనే ముఖ్యమంత్రి, కవచం, ఒక్క అమ్మాయి తప్ప' వంటి చిత్రాలతోపాటు... పలు ధారావాహికల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తన ఉనికిని ప్రకటించుకున్నారామె.
చదువుకునే రోజుల్లో హీరోయిన్ అవ్వాలని కలలు కన్న వాణిశ్రీ... వివాహానంతరం ఆ కలలకు కామా పెట్టి... గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించి.. ఇప్పుడు తన భర్తను ఒప్పించి... హీరోయిన్స్ కి అక్క, అత్త, వదిన వంటి పాత్రలు చేసి మెప్పించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
నిడివితో నిమిత్తం లేకుండా... అసభ్యత-అశ్లీలతలకు తావులేని పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నది తన అభిలాష అని చెబుతున్నారు వాణిశ్రీకుమార్!!
TAGS": vanisri kumar,gadjects,movie news,technical review,telugu movie news,latest news
Comments