యస్ పి బాలసుబ్రమణ్యం బయోగ్రఫి‍‍-( 1946 ను౦చి 2020)-S.P. Balasubramanyam Bio-Graphy

ఎస్పీ బాలు గా సుపరిచుడైన ఎస్పీబి అసలు పేరు శ్రీ ప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, 1946 జూన్ 4 న ఉమ్మడి ఆ౦ద్రప్రదేశ్ లోని  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట లో  బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. మద్రాసులో  చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు ఇతని తల్లిద౦డ్రులు పీ. సాంబమూర్తి, శకుంతలమ్మ , ఈయ‌నకు ఇద్దరు సోదరులు, నలుగురు సోదరిమణులు. విరిలో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంతలు సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వివాహం సావిత్రితో జరిగింది. వీరికి పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం.

 తన‌ ‍40 ఏళ్ళ సినీప్రస్తానంలో సుమారుగా 40 వేల పాటలును 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు
. తెలుగు, తమిల్ కన్నడంలో  ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా డబ్బి౦గ్  కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన కనపరిచిన ప్రతిభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వచె 29 సార్లు నంది పురస్కారాన్నిఅందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి మన‌ గాన గంధర్వుడు.

ఎస్పి. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు

భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు,మొత్త౦  7 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు,అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. తరువాత 1981 లో బాలీవుడ్ సినిమా ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.

ఎస్పి. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న విశిష్ట పురస్కారాలు

  1. పద్మశ్రీ (2001),
  2. డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999),
  3. పద్మభూషణ్ (2011),
  4. శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), 

ఆగస్టు 5 2020 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.తరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలతో  చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. 2020 సెప్టెంబరు 25 వ తేదిన మధ్యాహ్నం 1.04 లకు స్వర్గీయులయ్యారు.

TAG:"sp,sp balasubramanyam,bio- graphy,Film stars,top 10 telugu"


                                                                                                                                manchigorla

Comments