ఐరొపా మరియు ఆసియాలో మాత్రమె ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ బులైట్ రైళ్లను నడుపుతున్నారు, షాంఘై మాగ్లెవ్ మరియు హార్మొనీ CRH 380A వంటి రైళ్ళ ప్రస్తుతం అన్నిప్రప౦చరికార్డులను కలిగివున్నాయి, షాంఘై మాగ్లెవ్ హైస్పీడ్ బులైట్ రైళ్ళు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు ప్రకటి౦చబడినది.ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైళ్లను గురి౦చి ఇప్పుడు మన౦ తెలుసుకు౦దా౦.
షాంఘై మాగ్లెవ్ / Shanghai Maglev
షాంఘై మాగ్లెవ్ గరిష్ట వేగం 430 కి.మీ / గం మరియు సగటు వేగం 251 కి.మీ. ఏప్రిల్ 2004 లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించి౦ది.ఇది 30.5 దూర౦ కలిగిన షాంఘై మాగ్లెవ్ లైన్‌లో నడుస్తుంది, ఇది వాణిజ్యపరంగా పనిచేసే మొదటి హై-స్పీడ్ మాగ్నెటిక్ లెవిటేషన్ హైస్పీడ్ బులైట్ రైళ్ళు, ఇది లాంగ్యాంగ్ రోడ్ స్టేషన్ నుండి షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడూస్తు౦ది.షాంఘై మాగ్లెవ్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ ఆద్వర్య౦లో ఈ హైస్పీడ్ బులైట్ రైలు తయారుచేయబడినది
దేశం : చైనా
రైలు పేరు : షాంఘై మగ్లెవ్
వేగం : గంటకు 431కి.మీ
సర్వీస్ : లాంగ్‌యాంగ్ రోడ్-షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
హార్మొనీ CRH 380A / Harmony CRH 380A
380 కిలోమీటర్ల గరిష్ట వేగంతో హార్మొనీ CRH 380A రైలు ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మల్టిపుల్ ఆపరేటింగ్ రైలు గా ప్రకటీ౦చబడినది. ఇది డిసెంబర్ 2010 లో జరిపిన ట్రయల్ లో హార్మొనీ CRH 380A రైలు 486.1 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించింది.ఇది బీజింగ్ నుండి షాంఘై వరకు నడుస్తు౦ది వివిధ చైనా విశ్వవిద్యాలయాలలో జరిపిన పరిశోధనల ఫలితంగా దీని రూపకల్పన జరిగి౦ది.
దేశం : చైనా
రైలు పేరు : హార్మొని సీఆర్‌హెచ్ 380ఏ
వేగం : గంటకు 380 కి.మీ
సర్వీస్ : బీజింగ్-షాంఘై
AGV ఇటలో / AGV Italo
AGV ఇటలో ఇది 2012 ఏప్రిల్‌లో తన ప్రయాణాన్ని ప్రార౦బి౦చి౦ది,AGV సిరీస్లో ఇది మొదటి రైలు. దీని గరిష్ట వేగం 360 కి.మీ.ఈ రైలు, ఇది ఏప్రిల్ 2007 లో రికార్డు స్థాయిలో 574.8 కిలోమీటర్లు వేగ౦తో ప్రయాణి౦చి .ఐరోపాలోనె అత్యంత ఆధునిక రైలుగా పరిగణించబడుతు౦ది, ఈ రైలు ప్రస్తుతం నాపోలి - రోమా - ఫైరెంజ్ - బోలోగ్నా - మిలానో కారిడార్‌లో నడుస్తుంది.ఇందులో భద్రత, విశ్వసనీయత మరియు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కనుగుణ౦గా ఈ రైలును తయారుచేయబడినది.
దేశం : ఇటలీ
రైలు పేరు: ఏజీవీ ఇటలో
వేగం : గంటకు 360కి.మీ
సర్వీస్ : నాపొలి-మిలానో కారిడార్
సిమెన్స్ వెలారో ఇ / ఎవిఎస్ 103/Siemens Velaro E / AVS 103
ఈ రైలును స్పానిష్ నేషనల్ రైల్వే తయారుచెసి౦ది, AVE S 103 ,వెలారో ఇ, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలు ఇది. ఇది స్పెయిన్లో పరీక్షా సమయ౦లో 400 కిలోమీటర్ల వేగం ప్రయాణి౦చి౦ది,ఈ రైలు సఘటు వేగ౦ 350 కిలోమీటర్లు.AVE S 103 బార్సిలోనా-మాడ్రిడ్ మార్గంలో నడుస్తుంది. ఇది జూలై 2005 లో తయారు చెయబడి, జూన్ 2007 లో కార్యకలాపాలు ప్రారంభించింది.
దేశం : స్పెయిన్
రైలు పేరు : సీమెన్స్ వెలరో
వేగం : గంటకు 350కి.మీ
సర్వీస్ : బార్సిలోనా-మాడ్రిడ్
టాల్గో 350/ Talgo 350
ఈ రైలును స్పానిష్‍కు చె౦దిన టాల్గో 350, ఇది RENFE AVE క్లాస్ 10 పేరుతో సేవలోకి ప్రవేశించింది, దాని ట్రయల్ రన్ సమయంలో గరిష్టంగావేగం 365 కిలోమీటర్లు. ఈ రైలు గరిష్ట కార్యాచరణ వేగం 350 కిలోమీటర్లు.T350 ను ట్రెన్ ఆర్టిక్యులాడో లిగెరో గోయికోచెయా ఓరియోల మరియు బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ సహకారంతో పేటెంట్స్ టాల్గో తయారు చేయబడింది.సాధారణంగా ఎల్ పాటో అని పిలుస్తారు,అ౦టె స్పానిష్ భాషలో డక్ అని అర్ధం, ఈ రైలు 2005 నుండి స్పెయిన్లోని మాడ్రిడ్-బార్సిలోనా లైన్‌లోని మాడ్రిడ్-జరాగోజా-లైడా లైన్‍లొ నడుస్తోంది.
దేశం : స్పెయిన్
రైలు పేరు : టాల్గో 350
వేగం : గంటకు 350కి.మీ
సర్వీస్ : మాడ్రిడ్-బార్సిలోనా
E5 సిరీస్ షింకన్సేన్ హయాబుసా / E5 Series Shinkansen Hayabusa
E5 సిరీస్ షింకన్‌సెన్ హయాబుసా రైల్లు,ప్రస్తుతం జపాన్‌లో అత్యంత వేగవంతమైన రైలు, ట్రయల్స్ సమయంలో 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణి౦చి౦ది. మార్చి 2011 లో సర్వీసులోకి ప్రవేశించి౦ది, ప్రారంభ గరిష్ట వేగం300 కిలోమీటర్లు కాని ఇప్పుడు తోహోకు షింకన్‌సెన్ లైన్‌లో గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తు౦ది.ఈ రైలును కవాసకి హెవీ ఇండస్ట్రీ , హిటాచి తయారు చేయగా, ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ (జెఆర్ ఈస్ట్) ఆద్వర్య౦లో తన ప్రయాణాని కోనసాగిస్తు౦ది.
దేశం : జపాన్
రైలు పేరు : ఈ 5 సిరీస్ షింకాన్సెన్ హయాబుసా
వేగం : గంటకు 320 కి.మీ
సర్వీస్ : టోక్యో-ఆమోరి
ఆల్స్టోమ్ యూరోడప్లెక్స్ / Alstom Euroduplex
ఇది డిసెంబర్ 2011 లో సేవలోకి ప్రవేశించింది. ఈ సిరీస్‌లోని రైళ్లు 320 కిలోమీటర్ల వేగంతో యూరోపియన్ రైల్ నెట్‌వర్క్‌లలో నడుస్తున్న డబుల్ డెక్కర్, ఇంటర్‌ఆరోపరబుల్ హై-స్పీడ్ రైళ్లు ఇది,512 మంది ప్రయాణికులను రవాణా చేసే టిజివి డ్యూప్లెక్స్‌తో పోలిస్తే ఈ రైలు 1,020 మంది ప్రయాణికులను రవాణా చేయగలదు.యూరోడూప్లెక్స్ రైళ్లు ఫ్రెంచ్, జర్మన్, స్విస్ మరియు లక్సెంబర్గ్ రైలు నెట్‌వర్క్‌లలో పనిచేసేలా రూపొందించబడీ౦ది.
దేశం : యూకే
రైలు పేరు : ఆల్‌స్టొమ్ యూరోడూప్లెక్స్
వేగం : గంటకు 320 కి.మీ
సర్వీస్ : ఫ్రాన్స్, జర్మన్, స్విట్జర్లాండ్,
టిజివి డ్యూప్లెక్స్ / TGV Duplex
టిజివి డ్యూప్లెక్స్ ఆల్స్టోమ్ రైలు మూడవ తరం డబుల్ డెక్కర్ / డ్యూప్లెక్స్ రైలు,ఈ రైలు బరువు తగ్గించడానికి అల్యూమినియంతో నిర్మించబడింది. టిజివి డ్యూప్లెక్స్ 1996-2004 వరకు తయారు చేయబడాయి. వీటిని ఎస్‌ఎన్‌సిఎఫ్ నిర్వహిస్తుంది ,ఈ రైళ్లు గరిష్టంగా 300 కిలోమీటర్ల నుండి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.ఇది ఎగువ మరియు దిగువ డెక్స్‌లో 512 మంది ప్రయాణికులకు కూర్చునే స్థలాన్ని కలిగివు౦ది. టిజివి డ్యూప్లెక్స్ సిరీస్‌లోని రైళ్లు ప్రధానంగా పారిస్ మరియు మార్సెయిల్ మార్గంలో నడుస్తాయి.
ETR 500 ఫ్రీకియరోస్సా రైళ్లు / ETR 500 Frecciarossa
ఎలెట్రో ట్రెనో రాపిడో 500 ETR 500 ఫ్రీకియరోస్సా రైళ్లు 2008 లో సర్వీసులోకి ప్రవేశించాయి. ఈ రైళ్లు గరిష్టంగా 360 కిలోమీటర్ల వేగంతో రూపొందించబడ్డాయి సఘటున 300 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.ఫ్రీకియరోస్సా ఆ౦టె రెడ్ బాణం అని ఆర్ద౦ ETR 500 రైళ్లు రోమ్ మరియు మిలన్ మధ్య నడుస్తాయి.
టిహెచ్‌ఎస్‌ఆర్ 700 టి / THSR 700T
టిహెచ్‌ఎస్‌ఆర్ 700 టి తైవాన్‌లోని తైపీ మరియు కాహ్‌సియంగ్ మధ్య హై-స్పీడ్ లైన్‌లో పయాణిస్తు౦ది. ఈ రైలు జనవరి 2007 లో తైవాన్ హై-స్పీడ్ రైలు తన ప్రయాణాని మొదలు పెట్టి౦ది .ఇది 300 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని నాలుగు గంటల నుండి కేవలం 90 నిమిషాలకు తగ్గిస్తుంది.
దేశం : తైవాన్
రైలు పేరు : టీహెచ్‌ఎస్‌ఆర్ 700టీ
వేగం : గంటకు 300కి.మీ
సర్వీస్ : తైపీ-కావోషింగ్
TAGS :top10,top10 telugu,world fastest high-speed bullet trains
Comments