దీపాలను వెలిగించె సంప్రదాయం ఎప్పటి నుండి వచ్చిందని? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో హిందూ మతంలో మాత్రమె ప్రతిరోజూ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని సకల ప్రాణ కోటి మనుగడుకు మూలాదార౦. దీపాల వెలుగును మన౦ సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు, రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలను కలిగినివిగా మనవేదాలు చెబుతాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతిదేవిగా పురాణాలు చెబుతున్నాయి.
మొదట మనం మతపరమయిన కారణం తెలుసుకు౦దా౦ .. దీపం అనేది అనుకూలతఅ౦టె పాజిటివ్కు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ఈ దీపం వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుందని చాలా మంది భావన. హిందూ మతచార౦ ప్రకారం, దీపం వెలిగించడానికి కారణం అజ్ణానం అనే చీకటిని తొలగించి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం. అదే సమయంలో దీపాలను ఆవు నెయ్యితో వెలిగిస్తే.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని.. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. తాంత్రిక పూజలను విజయవంతం చేయడానికి నెయ్యి దీపం మరియు నూనె దీపాన్ని వెలిగిస్తారు. మరొక కారణ౦ ఏమిట౦టె ఇది సైన్స్ ప్రకార౦ కూడ దీపం వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. వీటి వల్ల రక్తకణాలు ఉత్తేజమవుతాయి
దీపం వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది. మన౦ ఇంట్లో స్వచ్ఛమైన దేశీ నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి.. సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఆనె చెడున ప్రారదోలుతు౦ది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం, ఏ మంచి పని చేసినా.. లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా దీపాన్ని వెలిగించడంతో ఆ పనిని ప్రారంభిస్తారు.
మరికొంతమంది నిత్య౦ ఉదయం మరియు సాయంకాలం దీపాలను వెలిగిస్తూ ఉండారు. మరికొందరు రాత్రి, పగలు అనె తెడాలెకు౦డా దీపం వెలుగుతూ ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం.
దీపం వెలుగుతో చీకటి మాయమవ్వడమే కాదు.. మనలోని అంధకారాన్ని.. మన మనసులోని చెడు భావలాను అంటే అంధకారాన్ని కూడా తొలగించే శక్తి ఈ దీపానికి ఉ౦ది. ఇంతటి అద్భుత శక్తి గల దీపం లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం.. ఆరాధిస్తాం. దీపానికి నమస్కరించడమే కాదు.. ప్రదక్షిణలు చేసి పండుగ చేసుకోవడమే దీపాల ప౦డుగ అయినటువ౦టి కార్తీకమాస౦.
అంతటి మహత్యం కలిగి ఉన్న దీపాన్ని వెలిగించడమంటే.. జీవిత ఎదుగుదలకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడమని మన పెద్దలు చెబుతారు. కావున దీపావళి రోజుతో పాటు కార్తీక మాస౦లో దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు
Comments